ఆకాశంలో ఏవైనా మార్పులు జరిగినా…ఎలాంటి కొత్త వస్తువులు కనిపించినా…సాధారణంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఇదే తరహాలో నిన్న సాయంత్రం నుంచి నింగిలో తేలియాడుతున్న కొన్ని వస్తువులు …హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. గాల్లో ఎగురుతున్న వాటి గురించి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఓ పరిశోధక సంస్థ ప్రకటనతో గంటల తరబడిగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. వాతావరణంలో మార్పులపై అధ్యయనాలకు ఈ బెలూన్లను పంపినట్లు వెల్లడించింది. “టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ ఫెసిలిటీ” పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు…ఈ బెలూన్లు ప్రయోగించినట్లు తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరున్నర వరకు ఆకాశంలో కనిపించిన ఈ బెలూన్లు… సుమారు 30 నుంచి 42 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి తిరిగి కిందకు చేరుకుంటాయి. ఈ బెలూన్ల లోపల శాస్త్రవేత్తలు బరువైన పరికరాలను అమర్చారు. వాతావరణానికి సంబంధించిన మార్పులను ఈ పరికరాలు సేకరిస్తాయి. హైదరాబాద్ లో వదిలిన ఈ బెలూన్లు వికారాబాద్ జిల్లా…మర్పల్లిలో కిందకు దిగాయి. వీటిని హీలియం బెలూన్లు అని కూడా పిలుస్తారని…హైదరాబాద్ తో పాటు…విశాఖ, షోలాపూర్ లో ఆకాశంలోకి వదిలినట్లు పరిశోధకులు తెలిపారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
source
Tags Andhravani AndhravaniVideo ap AP News Balloons Change climate Climate Change climate change facts climate change news ETV ETV Aaha Etv andhra pradeshNews ETV Andhravani Etv AP Etv Ghantaravam ETV Live Etv Margadarsi Etv News Live Video ETV NewsVideo Etv Sakhi Etv Sukhibhava ETV Talkies ETV Telangana ETV Telugu ETV World Etv11 Etv11 india ETVTelugu Health Magazine Health Show Hyd Lakshyam latest news Latest News Videos Live TV Munrdhadugu National News Video research scientists Studies Telangana Latest News Telangana News Telangana Updates Telugu News తలయడతననబలనల నగల
Check Also
Global Warming Pictures|| Save🌏 plz👈😔#shorts #viral
Global Warming Pictures|| #savewater #pollution #globalisation #saveearth #planttree source